Friday, April 18, 2025

262 అక్రమ నిర్మాణాల కూల్చివేత 111.72 ఎకరాల భూమి స్వాధీనం – ప్రభుత్వానికి హైడ్రా లేటెస్ట్ రిపోర్టు

కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ పరిసరాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదించింది. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా, ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

హైడ్రా గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్​పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్​పూర్​లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది.

మరోవైపు ‘హైడ్రా’కు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని సైతం కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com