ఎన్టీఆర్ జిల్లా: గన్నవరం నియోజకవర్గం÷ ఇచ్చిన మాటకు కట్టుబడి వుండే నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశంసించారు. రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న 400 గ్రామపంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఎనికేపాడు టంకశాల కల్యాణ మండపంనందు గన్నవరం నియోజకవర్గం లో 11 పంచాయితీలకు, మైలవరం నియోజక వర్గం లో 6 పంచాయితీలకు లక్ష చెప్పున చెక్కులను గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు , తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేసారు. ఈ పంపిణి కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమ్మిశెట్టి వాసు , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనిత బీజేపీ నేతలు ఫణి కుమార్ కూటమి నేతలు , పలు గ్రామాల సర్పంచ్ లు , గ్రామ పార్టీ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ : డిప్యూటీ సిఎం పవన్ వరద భాదితులు కోసం సొంత నిధులు కేటాయించటం అభినందనీయమని మనస్పూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.గత సంవత్సరం ఇదే రోజున చంద్రబాబు అరెస్ట్ తెలుసుకుని ఏపీ కి వస్తుంటే పోలీసులు ఆపేశారని ఆనాడు వీరుడిలా ఎంతో పోరాడారని గుర్తు చేశారు.మే 7 న తన విజయాన్ని కాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గం లో తన కోసం ప్రచారం చేసారని అన్నారు.వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాట కోసం పని చేసారని అనుకున్న లక్ష్యం పవన్ సాధించారని పేర్కొన్నారు.ఇంత మంచి చేసిన ఆయనకు కృతజ్ఞతలు కన్నా ఇంకా ఏమి చెప్పలేనన్నారు.గత ఏడాది ఇదే రోజు చంద్రబాబు ను అన్యాయం గా అరెస్ట్ చేసారని గుర్తు చేసుకున్నారు.
ప్రజా స్వామ్యం లో ప్రజలు నియంతలను కాలగర్భంలో కలిపిన సంఘటనలు అనేకం గా ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.విజయవాడలో వరదలు వస్తే మొదటి రోజు సీఎం చంద్రబాబు ఉదయం 4:30 వరకు పని చేసారని అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఉండటం రాష్ట్ర ప్రజలు అదృష్టమని అన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందించే బాధ్యత తనకు అప్పగించారని …. వరద లో చిక్కుకున్న చివరి వ్యక్తి వరకు ఆహారాన్ని అందచేసానని ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేయడం ఆనందంగా ఉందన్నారు.
అంబాపురం లో వరద వస్తుందని తెలిసి మొదటగా అక్కడికి వెళ్లిన వ్యక్తి నీ తానే అని ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉన్నానని వరద ఎక్కువ రావడం కారణం గా కొంత మందినే రెస్క్యూ చేసి ఒడ్డు కు చేర్చమన్నారు…
ఉమ్మడి కృష్ణ లో వైసిపి నుండి పోటీ చేసిన 16 మంది కనపడటం లేదని విమర్శించారు.
కొన్ని కుటుంబాల్లో చెల్లి కో అన్న కో నచ్చని పరిస్థితులు ఉంటాయని కానీ తల్లి కి నచ్చని వ్యక్తి ఎవరు ఉండరని తల్లికి కూడా నచ్చని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు.
పోలవరం మట్టి దోచిన వ్యక్తులకు బుడమేరు బాధితుల ఉసురు తప్పకుండా తగలకుండా పోదని స్పష్టం చేశారు.
ఊహించని విధంగా ప్రజలు మాకు విజయాన్ని అందచేశారని విజయాన్ని గర్వంగా భావించకుండా బాధ్యత గా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
గత పాలన లో ఎమ్మెల్యేలు మంత్రులు వెదవలు లాగ మాట్లాడారని నేడు ప్రజలకు కష్టాలొస్తే వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
నా మీద పోటీ చేయండి నా మీద పోటీ చేయండి అని పవన్ ను చంద్రబాబును విమర్శించిన వారు ఎక్కడ ఉన్నారని మాజీ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు….
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజల మీద జగన్ కక్ష కట్టారని అన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదని మొదటి గా చెప్పిన వ్యక్తి ని తానే అని చెప్పుకొచ్చారు….
విజయవాడ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తానని గన్నవరం దశ దిశ మార్చుతా రాసిపెట్టుకోండి అంటూ ధీమా వ్యక్తం చేశారు.