తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నెవాడా మరియు అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. అక్కడ ఆయన ఫెడరల్ ప్రభుత్వ అధికారుల బృందం ఆధ్వర్యంలో డ్యామ్ మొత్తం పర్యటించారు.
విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగాన్ని, మొత్తం నిర్మాణ వ్యవస్థను, కాలక్రమంలో నీటి అందుబాటుతో పాటు విద్యుత్ ఉత్పత్తి చరిత్రను ఆయన అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జల విద్యుత్ ప్రాజెక్టులతో హూవర్ డ్యామ్‌ను పోల్చి చూశారు.
అలాగే, డ్యామ్ నిర్మాణంలో కార్మికుల భద్రతకు చేపట్టిన వివిధ భద్రతా చర్యలను, 1931 నుండి 1935 వరకు జరిగిన డ్యామ్ నిర్మాణ చరిత్రను డిప్యూటీ సీఎం అధికారుల బృందం పరిశీలించారు.