24,25 తేదీల్లో అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొననున్న భట్టి
28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో భేటీ
30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం
అక్టోబర్ 4 వరకు కొనసాగనున్న పర్యటన
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం అమెరికా, జపాన్ దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతోపాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరింది. ఈనెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు పర్యటన కొనసాగనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్-పోతోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ఈనెల 24,25 తేదీల్లో అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరగనున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొంటారు.
అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఈనెల 26న లాస్ ఏంజెల్స్‌కు చేరుకుంటారు. ఈనెల 27న ఎడ్ వార్డ్, సన్ బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు. ఈనెల 28వ తేదీన పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. ఈ నెల 29న టోక్యోకి చేరుకుంటారు. ఈనెల 30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా (వన్ టు వన్) సమావేశమవుతారు. యామాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసాకి, అక్టోబర్ 3న పానసోనిక్ ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తారు. అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు వెళ్లారు.
దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది : సుదీర్ఘమైన జాతీయోద్యమ నేపథ్యం , దేశ దాష్య శృంఖలాలు తెంచడం కోసం జైళ్ళు నిర్బంధాలు, త్యాగాలు చేసిన నేపథ్యం కాంగ్రెస్ కి మాత్రమే ఉందని, దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ప్రజా స్వామిక విలువల కోసం కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ అని , దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. కాంగ్రెస్ మొదటి నుంచి ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంతటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అవినీతిపరులు, విభజన వాదులు , అర్బన్ నక్సలైట్ లు అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావని అన్నారు.
ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన కుటుంబం గాంధీ కుటుంబం అనీ, దేశ రక్షణ కోసం సమగ్రత శుక్షిరత కోసం , శాంతి కోసం ,స్వావలంబన కోసం తన ప్రాణం త్యాగం చేసిన మహాత్మా గాంధీ అని అన్నారు. గాంధీ నడయాడిన వార్ధా కేంద్రంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయమని భట్టి విక్రమార్క అన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బిజేపి పార్టీ మాత్రమే ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తే వాళ్ళను దేశ ద్రోహులుగా అర్బన్ నక్సల్స్ గా ముద్రించి నిర్భంధ పాత్ర పోషిస్తున్నదే బిజేపి అని అన్నారు. దేశంలో మోడీ అమలు పరుస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేకత ప్రశ్నించే క్రమంలోనే రాహుల్ గాంధీ దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన విషయం మర్చిపోవద్దన్నారు. జోడోయాత్ర లక్ష్యమే దేశంలో పెచ్చురిల్లిన మత విద్వేషం, రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామిక విలువల పునాదిగా బయలుదేరిందదన్నారు. కాంగ్రెస్‌లో విద్వేషం లేదని, ఈ దేశంలో మత రాజకీయాలు విద్వేష రాజకీయాలకు అబద్దాల పునాదిగా పని చేసేది బిజేపినే అని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీద నిరాధారమైన ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు