Thursday, December 12, 2024

‌చిన్నాభిన్నమైన రాష్ట్రాన్నిగాడిలో పెడుతున్నాం

గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు చిన్నాభిన్నం చేసి అప్పుల కుప్పగా మార్చిన ఆర్థిక వ్యవస్థను ప్రజా ప్రభుత్వం గాడిలో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 15 తర్వాతే వేతనాలు ఇచ్చే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి  3,69,200 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 2 లక్షల 88 వేల మంది పెన్షన్‌ ‌దారులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని తెలిపారు.  ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వని గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు ప్రజా ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు ఈ ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం రూ.52 వేల 118 కోట్ల అప్పులు తెచ్చి 64516 కోట్ల రూపాయలు అప్పు, వడ్డీలు చెల్లించామని తెలిపారు. అప్పులు కట్టడానికి తిరిగి మళ్లీ అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువొచ్చింది గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులే.. ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ 64, 516 కోట్లు చెల్లించడంతో పాటు, 24, 036 కోట్ల క్యాపిటల్‌ ఎక్స్పెండిచర్‌ ‌కోసం ఖర్చు చేశామని వివరించారు.  మరో 61 వేల 194 కోట్లు.. సంక్షేమం కోసం ఖర్చు చేశాం. రైతు భరోసా పథకానికి 7,625 కోట్లు, రైతు రుణమాఫీకి 2061, 7 కోట్లు, చేయూత పథకానికి 11,382 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి 890 కోట్లు, మహాలక్ష్మి పథకంలో భాగంగా అందిస్తున్న సబ్సిడీ సిలిండర్‌కు రూ.442 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.1234 కోట్లు, విద్యుత్‌ ‌సబ్సిడీకి రూ.11141 కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపునకు 1514 కోట్లు, బియ్యం సబ్సిడీకి 1647 కోట్లు, స్కాలర్‌షిప్‌ ‌డైట్‌ ‌చార్జీలకు 1016 కోట్లు, ఆర్టీసీకి 1375 కోట్లు, కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్‌ ‌పథకాలకు రూ.2311 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా శిశు సంక్షేమం కోసం రూ.98 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఏడాది పాలనలో ప్రజలపై పన్నుల భారం మోపకుండా వొచ్చిన ప్రతీ పైసాను అర్థవంతంగా ప్రజల కోసం ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌హయాంలో నిరుద్యోగల ఆశలు గల్లంతు
పదేళ్లు అధికారంలో ఉన్న గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు నిరుద్యోగ యువత ఆశలను అడియాసలు చేయడమే కాకుండా ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అతలాకుతలం చేసి గాలికి వదిలేశారని  భట్టి విక్రమార్క ఆరోపించారు.  గత పదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలను గాలికి వొదిలేస్తే ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56,000 మందికి ఉద్యోగాలిచ్చాం. ప్రకటించిన జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారంగా యూపీఎస్సీ మోడల్‌లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకుపోతున్నాం. గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే  శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాం. విద్యుత్‌ ‌రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత బీఆర్‌ఎస్‌ ‌పాలకులు విద్యుత్‌ ‌సరఫరా గురించి సోషల్‌ ‌మీడియా యూనివర్సిటీ ద్వారా ఉన్నది లేనట్టుగా..,  లేనిది ఉన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. సోషల్‌ ‌మీడియాలో బీఆర్‌ఎస్‌ ‌చేస్తున్నది తప్పుడు ప్రచారం అని ఆధారాలతో సహా మీడియా ముందుకు వొచ్చి లెక్కలతో సహా బయట పెట్టడంతో ప్రజలు ఛీ కొట్టే దశకు బిఆర్‌ఎస్‌ ‌దిగజారిపోయింది అని విమర్శించారు.  2024 లో 15,623 మెగావాట్లు ఉన్న గరిష్ట డిమాండ్‌ 2030 ‌నాటికి 22,448 మెగావాట్లకు, 2035 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్‌ ‌పెరుగుతుందని అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇంధన శాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతోంది.

ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎలాంటి కోతలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసింది యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ఎన్విరాన్మెంట్‌ ‌క్లియరెన్స్ ‌తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికి వొదిలేయగా, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఎన్‌విరాన్‌ ‌మెంట్‌ ‌క్లియరెన్స్ ‌తీసుకొచ్చాం. తెలంగాణను దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా మార్చే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం త్వరలో సమగ్ర రెనేవబుల్‌ ఎనర్జీ పాలసీని తీసుకురాబోతుంది. 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి అదనంగా మరో 20 వేల మెగావాట్లు మొత్తం 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేసి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. మహిళా స్వయం సహాయక బృందాల సాధికారత కోసం 4,000 మెగావాట్ల సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటులో ఈ మహిళా బృందాలను ప్రజా ప్రభుత్వం భాగస్వాములు చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వెయ్యి మెగావాట్ల  సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ఎనర్జీ శాఖ ఒప్పందం చేసుకుంది. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం భద్రాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌ను సబ్‌ ‌క్రిటికల్‌ ‌టెక్నాలజీ తో నిర్మించడం వల్ల ప్రజలపై భారం పడి భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వొస్తోంది. భద్రాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌సూపర్‌ ‌టెక్నాలజీతో కట్టాలని ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినప్పటికీ ఆనాటి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సబ్‌ ‌క్రిటికల్‌ ‌టెక్నాలజీ తో భద్రాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణం వల్ల రావలసిన అనుమతులకు ఆలస్యం కావడంతో 20 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. రూ.7290 కోట్లతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రూ.10515.84 కోట్ల అంటే రూ.325.24 కోట్లు పెరిగింది.

సబ్‌ ‌క్రిటికల్‌ ‌టెక్నాలజీని అవలంబించడం వల్ల ప్రతి సంవత్సరం 177.38 కోట్లు నష్టం వాటిల్లుతోందని అన్నారు. 1000 మెగావాట్ల విద్యుత్‌ ‌కొనుగోలు కోసం గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ‌సరఫరా చేసే విద్యుత్‌ ‌కాంట్రాక్టు సామర్థ్యం 1000 మెగావాట్ల కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉండడంతో టీజీ డిస్కంలు పీజీ సీఐఎల్‌ ఉపయోగించని కారిడార్‌పై 638.50 కోట్ల భారాన్ని మోపాయి. లాంగ్‌ ‌టర్మ్ ‌కారిడార్‌కు బదులుగా షార్ట్ ‌టర్మ్ ‌కారిడార్‌ ‌కోసం గత ప్రభుత్వం దరఖాస్తు చేసి ఉంటే ఈ మొత్తం ఆదా అయ్యేది. వెయ్యి మెగా వాట్ల కోసం ఎంఓయూ కుదుర్చుకున్నప్పటికీ 2000 మెగావాట్ల కారిడార్‌ ‌ను పొందాలని అప్పటి ప్రభుత్వం డిస్కములను ఆదేశించింది. అదనంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ‌సరఫరా కోసం ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదనపు 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్‌ ‌కారిడార్‌ ‌ను వదులుకోవడానికి టిజీ డిస్కౌంట్‌ 2018 ‌ఫిబ్రవరి 15న పిజిసీఐఎల్‌ ‌ను అభ్యర్థించాయి. పిజిసిఐఎల్‌ ‌టీజీ డిస్కం లపై 261.31 కోట్ల రూపాయల రీలింక్విష్‌ ‌మెంట్‌ ‌చార్జీలను విధించింది దీనిని టీజీ డిస్కములు సీఈఆర్‌సి ముందు సవాలు చేశాయి ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. కారిడార్‌ ‌యొక్క ఈ ఉపసంహరణ టీజీ డిస్కం లపై 261.31 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపడమే కాకుండా పిజిసిఐఎల్‌ ‌తో న్యాయపరమైన వివాదాలను గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సృష్టించబడ్డాయి.

అదనపు వెయ్యి మెగావాట్ల కారిడార్‌ ‌ను సరెండర్‌ ‌చేయడానికి టీజీ డిస్కములు 261.31 కోట్ల రూపాయలు చెల్లించినందున నేషనల్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ ‌టీజీ డిస్కములను డిఫాల్టర్లు గా ప్రకటించింది. దీని ఫలితంగా 13/ 9/24 న  60 మిలియన్‌ ‌యూనిట్లు విద్యుత్తు రాష్ట్ర ప్రజల అవసరానికి కావలసి వొచ్చినప్పుడు కొనుగోలు చేయలేకపోయారు. విద్యుత్‌ ‌శాఖ అధికారులు సకాలంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి నేషనల్‌ ‌లోడ్‌ ‌డెస్పాచ్‌ ‌సెంటర్‌ ఆదేశాలపై స్టే ఆర్డర్‌ ‌పొందడం వల్ల రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ ‌సంక్షోభం నుంచి తెలంగాణ బయటపడింది. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌పర్యావరణ అనుమతులను తీసుకురాకుండా గాలికి వొదిలేయడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయి ప్రజలపై అదనపు భారం పడుతున్నది 25,099 కోట్ల రూపాయల నుంచి ప్రాజెక్ట్ ‌వేయం 36,131 కోట్లకు పెరిగింది యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌లో విద్యుత్‌ ఉత్పత్తికి 50% ఇంపోర్టెడ్‌ ‌బొగ్గు, 50 శాతం స్థానికంగా లభించే బొగ్గును ను వాడతామని పర్యావరణ అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడంతో నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ‌పర్యావరణ క్లియరెన్స్ ‌ని సస్పెండ్‌ ‌చేసింది. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌ప్రారంభానికి సమగ్రమైన అధ్యయనం చేసి  ఎంవోఈఎఫ్‌, ‌సీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకొని పబ్లిక్‌ ‌హియరింగ్‌ ‌నిర్వహించి పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాం. ప్రతివారం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నాం 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం.

2025 మే నాటికి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది జార?ండ్‌ ఎన్టిపిసి  పవర్‌ ‌ప్రాజెక్టు కు బిహెచ్‌ఈ ఎల్‌ ‌కు  కోట్‌ ‌చేసిన ధరలతో పోల్చినప్పుడు యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌కు బిహెచ్‌ఎల్‌ అధిక ధరలను కోట్‌ ‌చేసింది. ఈ విధంగా కూడా ప్రజలపై అదనపు భారం పడింది ఎన్టిపిసి పట్రాట్‌ ‌ప్రాజెక్టు 24 వేల మెగావాట్ల సామర్థ్యం స్థాపించడానికి 132 కోట్ల రూపాయలు టెండర్‌ ‌వేయగా బీహెచ్‌ఈఎల్‌ ‌సంస్థ ఈ ఆర్డర్‌ ‌ను 11769 కోట్ల రూపాయలకు పొందింది అంటే ఒక్క మెగావాట్‌కు 4.90 కోట్లు దీనివలన ఎన్టిపిసికి 1950 కోట్ల ఆదా అయ్యాయి. యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణం కోసం బిహెచ్‌ఇఎల్‌ ఆఫర్‌ ‌ధర 22,958.25 కోట్లు, (రూ. 5.75కోట్లు/మెగా). ఎన్టిపిసి పట్రాట్‌ ‌ప్రాజెక్టు వ్యయం ఆధారంగా యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌యొక్క ఐదు యూనిట్లకు సమానమైన ధర 19, 165 కోట్లు మాత్రమే. ఆ విధంగా యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ ‌కోసం బీహెచ్‌ఈఎల్‌ ‌సంస్థ కోడ్‌ ‌చేసిన అదనపు ఖర్చు 3343 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర ప్రజల మీద అదనపు భారంగా మారింది.

యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ ‌నుంచి మొదటి సంవత్సరం టారిఫ్‌ ‌రూ.5.98/యూనిట్‌ ‌గా అంచనా వేయబడింది. 1600 మెగావాట్ల ఎన్టిపిసి రామగుండం ఫేస్‌ ‌వన్‌ ‌నుండి రూ. 5:55/ యూనిట్‌ ‌తారీఫ్‌ ‌తో పోల్చినప్పుడు ఇది ఎక్కువ. 2400 మెగావాట్ల ఎన్టిపిసి రామగుండం ఫేస్‌ ‌టు కి సమ్మతి ఇవ్వాలని గత ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకొని ఉంటే డిస్కములకు గణనీయమైన ఆదా జరిగేది ఈ టారిఫ్ల పోలిక ఎన్టిపిసి రామగుండంతో పోల్చితే అధిక ఉత్పత్తి వ్యయంతో యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌ని ఎంచుకోవాలని నిర్ణయం తెలంగాణ డిస్కంలతో పాటు రాష్ట్ర వినియోగదారులపై రాబోయే 25 సంవత్సరాల్లో 9,697 కోట్ల భారాన్ని గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు మోపారు. విద్యుత్తు రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిని సరిచేస్తూ ఈ ఏడాది కాలంలో ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును, రైతులకు ఉచిత విద్యుత్తును అందించాం. గురు జ్యోతి పథకం ద్వారా 49,71, 007 కుటుంబాలు గృహ జ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేశాం. దీని వల్ల తెలంగాణ ప్రజలకు 1336 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆదా ఆయన డబ్బులను ప్రజలు ఇతర ఉత్పాదక ఉపయోగాల కోసం ఖర్చు చేయగలుగుతున్నారు.

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌
‌ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్‌ ‌నుంచి 39,067 విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ అం‌దించే పథకాన్ని వినూత్నంగా ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు.  విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడానికి ఇప్పటి వరకు 198.87 కోట్లు ఖర్చు చేశాం. విద్యా సంస్థలకు రూఫ్‌ ‌టాప్‌ ‌సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లను అందించాలని ప్రణాళికలు తయారు చేశాం. విద్యుత్‌ ‌సమస్యలు త్వరితగతిన పరిష్కారం కోసం, సంబంధిత సామగ్రిని తరలించడానికి 108 అంబులెన్స్ ‌తరహాలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌టీం వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే వేసవి 2025 నాటికి 16877 మెగావాట్ల, 2030 నాటికి 22488 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ అవసరాలను తీర్చడానికి ట్రాన్స్‌మిషన్‌ ‌నెట్వర్క్ ‌ను బలోపేతం చేస్తున్నాం.

335 కోట్ల అంచనా వ్యయంతో బౌరంపేటలో 220 కేవీ సబ్‌ ‌స్టేషన్‌ ‌హుస్నాబాద్‌ ‌లో 200 కెవి సబ్‌ ‌స్టేషన్‌, ‌సీతారాంబాగ్‌లో 132 కెవి సబ్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణం చేపట్టాం. 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ‌ను తీర్చడానికి 1521 కోట్లతో 400 కే.వి 220కెబి 132 కే వి సబ్‌ ‌స్టేషన్ల నిర్మాణం, 192 పిటిఆర్‌లు పెంచడం, 220 కెవి, 132 కెవి ఓల్టేజ్‌ ‌లెవల్స్ ‌లో 55 కొత్త ప్రత్యామ్నాయ ట్రాన్స్మిషన్‌ ‌లైన్ల నిర్మాణం చేపడుతున్నాం. గ్రిడ్‌ ‌స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రాబోయే రెండేళ్లలో 500మెగావాట్‌ ‌బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ‌సిస్టంను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హరిత ఇంధన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ఆకర్షించే స్థాయిలో ముందుకు తీసుకువెళ్తాం.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular