ప్రజలకు జవాబూదారిగా ఉండాలన్న ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. విజయవాడ లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు జరిగిన రివ్యూ మీటింగ్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.
సదరు శాఖలుకు సంబందించి తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆయా శాఖల ద్వార ప్రజలకు ఏయే పనులు చేయవచ్చు, నిధుల ఖర్చు ఏవిధంగా ఉంటుందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పాలన సాగించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలకు జావాబుదారిగా ఉండాలని చెప్పారు. తాను నిరంతరం ప్రజలతో నేరుగా అనుసంధానం అవుతానని, అందుకు అధికారులు సహకరంచాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ సమీక్షల తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.