సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే పవన్‌ను సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు సూచించారు. అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, అక్కడి గిరిజనులను కలిసి ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ కల్యాణ్ బదులిచ్చారు. ఇవాళ ప్రారంభించాల్సిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తానన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని సింగపూర్ వెళ్లనున్నారు.