టీఎస్, న్యూస్:ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం, చల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం డీటీసీఈపీ లే అవుట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా డబ్బులు ఇస్తేనే పర్మిషన్ ఇస్తానన్న జగన్ మోహన్ డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జగన్మోహన్ కు రూ.50 వేలులంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.