Friday, September 20, 2024

తెలంగాణ స్టాల్ కు భారీ స్పందన

గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ లో సెప్టెంబర్ 16 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించిన “ప్రపంచ 4వ పునరుద్ధరణీయ ఇంధన పెట్టుబడిదారుల సదస్సు”లో తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసిన స్టాల్ దాదాపు 250 నుండి 300 వరకు జాతీయ – అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను మరియు డవలపర్స్ ను ఆకర్షించింది.

సోలార్, విండ్ మరియు బయో ఎనర్జీ రంగాల్లో కీలకమైన సంస్థలు సుజలాన్, రిన్యూ సోలార్, జిందాల్ ఇండియా, అమర్ రాజా, గ్రీన్ ఎనర్జీ, అవడా మరియు ప్రముఖ ఆర్ధిక సంస్థలైన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మన్ సంస్థ “Deutsche Gesellschaft fur International Zusammenarbeit (GIZ), ఇతర ప్రముఖ సంస్థలు తెలంగాణ పునరురుత్పాదక ఇంధన శాఖ కల్పిస్తున్న అవకాశాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరచారు. దీనికి తోడు యూరోపియన్ యూనియన్ వారి ఎనర్జీ క్లైమేట్ ఆక్షన్ మరియు ఎన్విరాన్మెంట్ విభాగం కౌన్సెలర్ శ్రీ బర్టోస్జ్ ప్రెజివార తన ప్రతినిధుల బృందం తో స్టాల్ ను సందర్శించి, రాష్ట్రము లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భముగా, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్, వైస్ – చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వావిళ్ళ అనిల గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలననే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రము లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు హాజరై పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రము లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు విజయవంతం కోసం తమ ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు వుంటాయని భరోసా ఇచ్చారని దాని ఫలితంగానే ఇంతటి స్పందన వచ్చిందన్నారు. దీనితో పాటు సదస్సు విజయవంతం అవడానికి పూర్తి సహకారాన్ని అందజేసిన ఇంధన శాఖ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, ఐఏఎస్, స్పెషల్ సెక్రటరీ శ్రీ కృష్ణ భాస్కర్, ఐఏఎస్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐఏఎస్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి ఐఏఎస్ ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular