టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంతో విజయ్ దేవరకొండ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. VD12 working Title ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విజయ్ లుక్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా వీడీ 12 ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 28న 2025లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.. అంటూ షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ హెయిర్ స్టైల్, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంలో కనిపిస్తున్నాడు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసిందనే చెప్పాలి.