ఎన్టీఆర్ దేవర మూవీ ఏకంగా నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఎన్టీఆర్ కెరియర్ లో సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చింది. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ‘దేవర’ మూవీతో బౌన్స్ బ్యాక్ అయినట్లే. ఇక రాజమౌళి ఫెయిల్యూర్ సెంటిమెంట్ కి ఈ మూవీతో ఎన్టీఆర్ బ్రేక్స్ వేసినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘దేవర’ క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించారు. ‘దేవర పార్ట్ 2’ అంతా కూడా వర క్యారెక్టర్ నేపథ్యంలోనే ఉంటుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అయితే అలాగే కొన్ని ఎలిమెంట్స్ ని కూడా పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్ గా విడిచిపెట్టారు.
పార్ట్ 2 లో వీటన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భైరా కొడుకుగా నటించిన కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. ‘వికటకవి’ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ‘దేవర’ సినిమా గురించి ఆయన మాట్లాడారు. మూవీలో దేవర క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించారు. నిజానికి ఆ క్యారెక్టర్ చనిపోదు. మూవీ క్లైమాక్స్ లో వర కూడా తండ్రి బాధ్యతలు తీసుకున్నట్లు చూపించారు. అది ఉంటుంది.
పార్ట్ 2లో మరల దేవర క్యారెక్టర్ రివీల్ అవుతుంది. అది ఎలా అనేది సస్పెన్స్. దేవర క్యారెక్టర్ చనిపోవడం అనేది జరగలేదు. ఏమైంది అనేది పార్ట్ 2లో స్పష్టత వస్తుందని తారక్ పొన్నప్ప చెప్పారు. పార్ట్ 2కి సంబంధించి కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. అయితే మరింత హైప్ చేసుకొని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకొని నెక్స్‌ట్ పార్ట్ కథని చెప్పే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో యతి క్యారెక్టర్ ఎవరనేది పార్ట్ 1లో రివీల్ చేయలేదు. అయితే ఈ యతి క్యారెక్టర్ ని పార్ట్ 2లోనే రివీల్ చేస్తారని తారక్ పొన్నప్ప చెప్పుకొచ్చారు.