Thursday, December 12, 2024

కొడంగల్‌కు మహర్దశ

ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుందని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కొడంగల్‌ ‌నియోజకవర్గంలో  మంత్రులు దామోదర రాజనరసింహ,  దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, జూపల్లి కృష్ణారావు.. రూ.76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వికారాబాద్‌ ‌జిల్లా పరిధిలో రూ. 24.11 కోట్ల వ్యయంతో  చేపట్టే పలు పనులన ప్రారంభించారు.  ఇందులో బొమ్మరాస్‌ ‌పేట్‌ ‌మండలంలో 267.50 లక్షలు, దౌల్తాబాద్‌ ‌మండలం రూ.413.10 లక్షలు, దుద్యాల్‌ ‌మండలం రూ.13.54  కోట్లు, కొడంగల్‌ ‌మండలం రూ.376 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ఉన్నాయి.

అనంతరం హరికృష్ణ మూవ్‌మెంట్‌ ‌చారిటబుల్‌ ‌ఫౌండేషన్‌ అల్పాహార  వంటశాల ప్రారంభించారు.  అనంతరం ఫౌండేషన్‌ ‌తెలంగాణ అధ్యక్షులు సత్య గౌరచంద్ర దాస అధ్యక్షతన  ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ మాట్లాడుతూ.. విద్యా, వైద్యం ద్వారా సామాన్య ప్రజానీకానికి సేవ చేయడం అదృష్టకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్య, వైద్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ఆదిశగానే ముఖ్యమంత్రి చొరవతో ఉన్నత ప్రమాణాలతో , అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అభిప్రాయపడుతూ.. మీకు మా సహకారం  ఎల్లప్పుడూ ఉంటుందని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ముందుకు వొచ్చిన హరికృష్ణ మూవ్‌ ‌మెంట్‌ ‌చారిటబుల్‌ ‌ఫౌండేషన్‌ ‌సేవలను మంత్రి అభినందియమన్నారు. వికారాబాద్‌ ‌జిల్లా  కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని 8 మండలాలైనా కొడంగల్‌, ‌బొమ్మరాస్‌  ‌పేట్‌, ‌దూద్యాల్‌ , ‌దౌల్తాబాద్‌, ‌నారాయణపేట జిల్లాలోని గుండుమల్‌, ‌కోస్గి, కొత్తపల్లి, మద్దూరులాలోని 312 ప్రభుత్వ పాఠశాలలోని  28 వేల మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం మంచి పరిణామమని మంత్రి తెలిపారు.

విద్యాప్రమాణాల పెంపునకు కృషి
విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ , విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని  వికారాబాద్‌ ‌జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు   అన్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న హరే కృష్ణ మూమెంట్‌ ‌చారిటబుల్‌ ‌ఫౌండేషన్‌ ‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుకబడి ఉన్న పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రణాళికతో ముందుకు వొస్తున్నారని ఆయన తెలిపారు . పారిశుద్ధ్య పనులతో పాటు రైతాంగ సోదరులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.  రాబోయే నాలుగేళ్లలో మంచి ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధికి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చదువు చూపుతుందని ఆయన వెల్లడించారు.

పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతమైన పాలమూరుకు మహర్దశ ప్రారంభమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  పక్కా ప్రణాళికతో  సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. హరే కృష్ణ మూమెంట్‌ ‌సేవలు రాష్ట్ర నలుమూలల రావాలని కోరారు. అనంతరం  డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పూలమాలవేసి  నివాళులర్పించారు. అదేవిధంగా విద్యార్థినిలతో మంత్రులు సహపంక్తి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ , ‌హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గురునాథ్‌ ‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కల్వ సుజాత, శాసనసభ్యులు రామ్మోహన్‌ ‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ‌టూరిజం డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌పటేల్‌ ‌రమేష్‌ ‌రెడ్డి, వయట్రీస్‌ ‌హెడ్‌ ‌మిచెల్‌ ‌డొమినికా తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular