Tuesday, December 24, 2024

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

  • మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
  • వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ,
  • అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలి
  • ఆగష్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధం చేయాలి

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. ఎంఏయూడి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, వాటర్‌వర్స్ ఎండి, సుదర్శన్ రెడ్డి, జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎంఆర్డీసిఎల్, ఎండి, ఆమ్రపాలి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ మూసీ రివర్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్ట్ పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరీవాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసే విధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్ధిష్ట ఉత్తర్వులతో రావాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఎంఆర్డీసిఎల్, ఎండి, ఆమ్రపాలి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంశాలను వివరించారు.

ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల డిపిఆర్‌లు, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ మొదలైన విభాగాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఆగష్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అనేక ప్రైవేటు సంస్థలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ఎంఏయూడి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్‌సాగర్ డ్యామ్ డౌన్‌టీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్ సాగర్ డ్యామ్ డౌన్‌టీమ్ పాయింట్ నుంచి బాపూఘాట్‌లో సంగమం పాయింట్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాద గురించి బోర్డు చర్చించింది. నగరంలోని మూసీనది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com