కర్నూల్ జిల్లా: శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న శ్రీగిరులు శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ వద్ద తెల్లవారు ఝాము నుండే పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు. ఆలయ రాజగోపురం ముందు భాగాన వున్న గంగాధర మండపం వద్ద కార్తీకదీపాల ను వెలిగిస్తున్న భక్తులు.స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరిన భక్తులు.
క్యూ లైన్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నవారికి పాలు,బిస్కెట్స్ తో పాటు అల్పాహారం అందించనున్న దేవస్థానం అధికారులు. శని, ఆది, సోమవారాల్లో స్వామి అమ్మవారి అర్జిత సేవలు, కుంకుమార్చనలు, స్పర్శ దర్శనాలను నిలిపివేసిన అధికారులు…శ్రీ గిరికి తరలివస్తున్న వందల కొద్దీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు వైపు పార్కింగ్ కు తరలిస్తున్న అధికారులు… ధర్మ ప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక కేదారి, గౌరీ వ్రతాలను నిర్వహించనున్న దేవస్థానం అధికారులు… లక్ష దీపోత్సవం నిర్వహణ తో పాటు, పుష్కరిని వద్ద దశ విధ హారతులను సమర్పించనున్న పండితులు.