Friday, April 11, 2025

జూన్ 4వ తేదీలోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

ధరణి కమిటీ కీలక నిర్ణయం
జూన్ 4వ తేదీలోగా పెండింగ్‌లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా ధరణి కమిటీ నిర్ధేశించుకుంది. ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ శనివారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం సచివాలయంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై చర్చించింది. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండున్నర లక్షల ఫిర్యాదులను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కమిటీ పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో ఇప్పటి వరకు లక్షన్నర ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. లక్ష ఫిర్యాదులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
ధరణి పోర్టల్‌లోని 119 విభాగాల్లో తప్పులున్నాయని, 76 మాడ్యూల్స్‌ను మారిస్తే సమస్యలను పరిష్కరించవచ్చని కమిటీ భావిస్తోంది.

వీటిని అడ్డంగా పెట్టుకొని గత ప్రభుత్వ పెద్దలు నిషేధిత, అసైన్డ్ భూములను తమ పేరిట బదలాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపైనా ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం పెద్దలు తమ పేరిట బదలాయించుకున్న భూములపై ఆరా తీస్తోంది. త్వరలోనే ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దరఖాస్తులు పక్కన…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించడానికి ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి అధికారులు సంబంధిత నివేదికలు తయారు చేశారు. మార్చి 16వ తేదీన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఉండడంతో ధరణి దరఖాస్తులను పరిశీలనను పక్కన పెట్టారు. ఈ క్రమంలో శనివారం కమిటీ సమావేశం అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com