Sunday, March 9, 2025

డైలాగులా… రచయితల పైత్యమా?

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక న్యూ డిఫరెంట్ పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు అర్ధమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇపుడు RAW అంటూ ఒక టీజర్ రిలీజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నాని మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్‌గా విడుదల కాగా, అది పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేసిన పాత్రల్లో ఇది అతను చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పొచ్చు. RAW ట్రుథ్ RAW లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం డిఫరెంట్ గా ఉంది. చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ.

జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ ఒక ప్రాంతంలో శవాలు, ఆకాశంలో కాకులను చూపిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది. . కథలో చేదు సత్యాలు, కష్టాల ద్వారా బలంగా ఎదిగే జీవన సత్యాలు ప్రతిబింబించేలా ఉంటుందని అర్ధమవుతుంది. అమ్మ రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన జాతి కథ.. అనే డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. కథలో కంటెంట్ చాలా వైల్డ్ ఎమోషన్స్ తో ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఒక ధగడ్ వచ్చి.. జాతిల మొత్తం జోష్ తెచ్చిండు.. ఆట్.. అంటూ నాని ఇంట్రో మొదలయింది. కాకులను ఒకటి చేసిన ఒక లం** కొడుకు కథ.. అని చెప్పిన విధానం చూస్తుంటే… దర్శకుడు సినిమాలో ఏమి చూపించబోతున్నాడు అన్న విషయాన్ని పక్కనబెడితే… ఈ కథను చెప్పే భాష మాత్రం చాలా దారుణంగా ఉంది.
ఇందులో ఒక డైలాగ్‌.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై మళ్లీ దుమ్మెత్తి పోసేలా మారింది. రాయడానికే కష్టంగా ఉండే పదాన్ని.. ఒక పెద్ద యోధుడిలా చూపిస్తూ.. నాని ఎంట్రీని చూపించారు. అంటే.. ఇక సినిమా వాళ్లు మొత్తంగా బరి తెగించారు. ఒకప్పుడు కామెడీ పాత్రదారులు మాట్లాడే చిన్న చిన్న వల్గర్‌ పదాలకు మ్యూట్‌ చేయడమో.. లేకుంటే వాటికి వేరే పదాలను జోడించడమే జరిగేది. రానురానూ టీవీ షో ల ద్వారా ఈ బూతు మరింత దిగజారిపోయింది. ద్వందార్థాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ పైత్యం సినిమాలకూ చేరింది. మొన్నటిమొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే ఓ సినిమా ద్వారా అనిల్‌ రావిపూడి చేసిన బూతు పురాణం ఇంకా సోషల్‌ మీడియాలో తిరుగుతూనే ఉంది. ఇప్పుడు నాని సినిమాలో ఏకంగా ఒ లం.. కొడుకు అంటూ అంటూ హీరో ఎంట్రీని చూపించడం.. టీజర్‌ చూసిన వారంతా తిట్టిపోసేలా మారిపోయింది. రచయిత పైత్యమా.. లేదంటే సినిమా ప్రమోషన్లలో ఇదీ ఓ భాగమా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి.
“ అమ్మ రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన జాతి కథ.. ఒక ధగడ్ వచ్చి.. జాతిల మొత్తం జోష్ తెచ్చిండు.. ఆట్.. కాకులను ఒకటి చేసిన ఒక లం** కొడుకు కథ.. అంటూ ఓ లేడీ వాయిస్‌లో చెప్పించినా.. కథలో కంటెంట్ చాలా వైల్డ్ అనేది మాత్రం ఎంతో కొంత అర్థమవుతూనే ఉంది. ఏం తీసినా.. ఎలాంటి పంచ్‌లు వేసినా సినిమాపై అంచనాలు పెంచడమే దర్శకుడు, నిర్మాత ఉద్దేశం అన్నట్టే ఈ టీజర్‌ ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com