Monday, March 10, 2025

కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు అవాస్తవం

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కొత్త ఇంచార్జీ మీనాక్షి
లేక్‌వ్యూలో మీనాక్షిని మర్యాదపూర్వకంగా కలిసిన సిఎం

పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు.. మా పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తెలంగాణలో పనిచేసే అవకాశం వొచ్చింది.. పీసీసీ చీఫ్‌, సీఎం, ఇతర నేతలు, కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానన్నారు. పార్టీ పటిష్టతకు, రాజ్యాంగ పరిరక్షణకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. రాహుల్‌ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లఢానికి కృషి చేస్తాననన్నారు. శుక్రవారం లేక్‌వ్యూలో బస చేసిన చేసిన ఆమెను సిఎం రేవంత్‌, మంత్రి పొన్నంలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.. అందరి అభిప్రాయాలకు సముచితస్థానం కల్పిస్తూ ముందుకెళ్తామన్నారు. తెలంగాణను సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారో..ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇక కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ చాలా సాదా సీదా వ్యక్తి. దిల్‌ కుష్‌ తో కార్యాలయ బయట కార్యకర్తలను కలిసి విష్‌ చేశారు. బొకేలు ఇస్తుంటే నిరాకరించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. అత్యవసర మీటింగ్‌లకు, రాహుల్‌ ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అత్యవసర పిలుపు వొస్తే మినహా ఆమె విమాన ప్రయాణం చేయరని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఇడ్లీయే ఆమె బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అని తెలుస్తోంది. కేవలం  రెండు జతల బట్టలే వాడుతారని అంటున్నారు. స్వాగతాలు, సన్మానాలు, బొకేలకు చాలా దూరంగా ఉంటారు.

శనివారం మౌన వ్రతం పాటిస్తారు. గాంధేయ సిద్దాంతంలో భాగం. ఆ రోజు ఎవరితో మాట్లాడరని, కేవలం సంజ్ఞలతోనే నడిపిస్తారని అంటున్నారు. కాన్వాయ్‌ ప్రయాణానికి దూరం సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకు ప్రయార్టీ ఇస్తారు. ఎక్కడైనా రాత్రి బస చేయాల్సి వొస్తే సొంత ఖర్చులతో మాజీ ఎంపీ హోదాలో ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇవ్వాళ రాత్రి కూడా దిల్‌ కుశా గెస్ట్‌ హౌస్‌ లో ఆమె బస చేయనున్నారు. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్‌ లైన్‌ లోనే రూ. 50 చెల్లించి ఓ గదిని బుక్‌ చేసుకున్నారు. గ్రూప్‌ యీటింగులు తప్ప పర్సనల్‌ మీటింగ్స్‌ కు దూరం. సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com