Thursday, December 26, 2024

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా..

చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్‌  దిల్‌ రాజు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి  (దిల్‌ రాజు) బుధవారం  ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య ఆయన  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌  డాక్టర్‌ హరీష్‌ దిల్‌ రాజును పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్‌ రాజ్‌ను అభినందించారు.
అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన  సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన షూటింగ్స్‌ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణకు చెందిన సినిమాల ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్‌ ల అనుమతులను సింగల్‌ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్‌ రాజ్‌ పేర్కొన్నారు.
అన్నివిధాలుగా అండగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వడంలో దిల్‌ రాజు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దిల్‌ రాజు బుధవారం ఉదయం పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com