రౌడీ హీరో అనగానే టాలీవుడ్‌లో గుర్తొచ్చేది విజయ్‌దేవరకొండ. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బేనర్‌లో విజయ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి.
ఎట్టకేలకు Family Star Movie ఫ్యామిలీ స్టార్‌తో వీరి కలయిక కార్యరూపం దాల్చింది. తాను కూడా రాజుతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఐతే అది ఆలస్యం అయిందని.. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ.. కరోనా టైంలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే రాజే అడ్వాన్స్ రూపంలో సాయం చేసిన విషయాన్ని వెల్లడించాడు విజయ్.
ఇక రాజు బేనర్లో గతంలో తనకు అవకాశం దక్కకపోవడం గురించి విజయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. రాజు నిర్మించిన కేరింత మూవీ ఆడిషన్స్‌కు తాను హాజరయ్యానని.. కానీ తనకు అవకాశం దక్కలేదని.. అప్పుడు తాను చాలా హర్టయ్యానని.. వీళ్లందరికీ తనేంటో చూపించాలి అని కసిగా అనుకున్నానని.. ఈ విషయం కొన్నేళ్ల కిందటే రాజుతో కూడా చెప్పానని.. కట్ చేస్తే ఇప్పుడు రాజు నిర్మాతగా తాను సినిమా చేశానని విజయ్ తెలిపాడు.