తెలంగాణ ఫిల్మ్ డెవల్ప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండేళ్ల పాటు TFDC ఛైర్మన్ పదవిలో కొనసాగనున్న దిల్ రాజు తాజాగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం TFDC ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. TFDC ఛైర్మన్ గా దిల్ రాజును రేవంత్ రెడ్డి నియమించడం వల్ల సినీ ఇండస్ట్రీకి మరింత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దిల్ రాజు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ డా. హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజ్ ను అభినందించారు. పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ, తెలంగాణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చేందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వనున్నట్తు చెప్పారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణా లో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణాకు చెందిన సినిమాల ప్రోత్సాహానికి ప్రాధాన్యత నిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎక్సహిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.