టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొత్త ఏఐ స్టూడియోను లాంచ్ చేశారు. టాలీవుడ్ లో ఫస్ట్ ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. తాజాగా స్టూడియో ప్రా రంభవేడుక నిర్వహించగా.. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు.
దీనికి లార్విన్ ఏఐ అని పేరు పెట్టారు. ఈ వేడుకకు డైరెక్టర్లు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, వి.వి.వినాయక్ లాంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏఐ స్టూడియో పెడుదా మనే ఆలోచన వచ్చింద న్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, మాట్లాడు తూ…. దిల్ రాజుతో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది అధునాతన సాకేతికను సినిమాకి జోడించాలన్న దృఢ సంకల్పంతో ఆయన ఈ స్టూడియోను నిర్మించారన్నారు.
ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపో యింది. సినిమా రంగంలో దీని అవసరం చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పనులు చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకే క్వాంటమ్ ఏఐ కంపెనీతో చర్చలు జరిపిన తర్వాత దీన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.