విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.
ఓ ఇన్‌ఫ్లూయన్స్ వున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది, దాని గురించి వార్తలు బయటికి వస్తే ప్రభుత్వమే కూలిపోతుంది. దినిని నుంచి గట్టెక్కించగల ఎక్స్ పర్ట్ ని ప్రభుత్వం ఆశ్రయిస్తుంది. వెంకటేష్ ఎక్స్ పోలీసు, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అతని భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్ )తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు. వెంకటేష్ మాజీ ప్రియురాలు, పోలీసుగా ఉన్న మీనాక్షి చౌదరి కిడ్నాప్ కేసును ఛేదించడంలో సహాయం కోసం అతనిని సంప్రదించడంతో వారి ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. వెంకటేష్ మిషన్‌ను చేపట్టడానికి అంగీకరిస్తాడు, అయితే భాగ్యం సపోర్ట్ తో అతను ఆపరేషన్‌లో భాగం కావాలని పట్టుబటతాడు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిజామాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరగడం చాలా హ్యాపీగా వుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ కి థాంక్ యూ. నాకు ఎన్నో హిట్లు ఇచ్చారు. బొబ్బిలిరాజా, చంటి, గణేష్ , సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నాం. సంక్రాంతి సినిమా ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అఫ్ ఎంటర్ టైన్మెంట్, సాంగ్స్.. ఇలా అనిల్ హోల్సం ఎంటర్ టైనర్ ని ఇచ్చారు. మీ అందరికీ నచ్చుతుంది. మీ అభిమానం సంక్రాంతికి చూపిస్తారు. ఈ సినిమాలో పాటు గేమ్ చెంజర్ డాకు మహారాజ్ అన్నీ పెద్ద హిట్లు కావాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు బ్యానర్ లో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దిల్ రాజు, శిరీష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనిల్ థాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య, మీనాక్షి చాలా అద్భుతంగా పెర్ఫారం చేశారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు(నవ్వుతూ). సినిమా చూడండి. మామూలుగా వుండదు. అందరికీ థాంక్ యూ’ అన్నారు.