Friday, February 21, 2025

“దిల్ రూబా” సెకండ్ సింగిల్ ‘హే జింగిలి..’

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “దిల్ రూబా” సెకండ్ సింగిల్ ‘హే జింగిలి..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 18న సాయంత్రం 5.01 నిమిషాలకు ‘హే జింగిలి..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘అగ్గిపుల్లె..’ పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com