Thursday, April 17, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలనం.. ఐదుగురికి ఉరి శిక్ష

  • దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు చుక్కెదురు..
  • నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
  • NIA కోర్టు ఇచ్చిన తీర్పు ను సమర్దించిన హైకోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇందులో ఐదు మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది హైకోర్టు. ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది.

ఐదు మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణను జరిపింది. 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితులు. దీనిపై ఈరోజు విచారణకు రాగా.. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించారు.

ఈ కేసులో ఏ2 అసదుల్లా అక్తర్ ( యూపీ), ఏ3జియ ఉర్ రహమాన్ ( పాకిస్థాన్), ఏ4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ ( బీహార్ ), ఏ5 మహమ్మద్ యాసిన్ భత్కల్, ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహారాష్ట్ర) ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com