నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కేతికా శర్మ ‘అదిదా సర్‌ప్రైజ్’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ సాంగ్‌లో ఆమె డ్యాన్స్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చినప్పటికీ, ఆ సాంగ్‌లోని కొన్ని డాన్స్ స్టెప్స్ వివాదాస్పదంగా మారాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌లోని కొన్ని స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను అవమానకరంగా చూపించాయని నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ వివాదం తెలంగాణ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో, సుమోటోగా కేసు నమోదు చేసి, సినిమా టీంకు నోటీసులు జారీ చేసింది. దీంతో నిర్మాతలు థియేటర్ వెర్షన్‌లో ఆ వివాదాస్పద స్టెప్స్‌ను తొలగించారు. తర్వాత యూట్యూబ్‌లో విడుదలైన లిరికల్ వీడియోలోనూ ఆ స్టెప్స్‌ను కత్తిరించారు. ఈ వివాదం సినిమాకు ఊహించని పబ్లిసిటీ తెచ్చినప్పటికీ, రాబిన్‌హుడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ వివాదంపై కేతికా శర్మ స్పందిస్తూ, తాను డైరెక్టర్ సూచనల మేరకే నటించానని వివరణ ఇచ్చింది. “నేను డైరెక్టర్ చెప్పినట్లు చేశాను. నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని, కంప్లీట్‌గా సరెండర్ అవుతాను. వారు చెప్పిన ప్రాసెస్‌ను ఫాలో అవుతాను, అంతకు మించి నేను ఆలోచించలేదు,” అని అన్నారు.