Thursday, May 29, 2025

డర్టీ పీఆర్‌ గేమ్స్‌ అంటూ సందీప్‌ ఫైర్‌

టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు “సందీప్ రెడ్డి వంగా”. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని.. ఆ తర్వాత ఊహించని విధంగా బాలీవుడ్ లో తన రెండో సినిమాని డైరెక్ట్ చేశారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని “కబీర్ సింగ్” గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక రీసెంట్ గానే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్‌తో కలిసి “యానిమల్” చిత్రాన్ని తెరకెక్కించి రికార్డులు తిరగరాశాడు. దాంతో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే సందీప్ సినిమాల విషయాన్ని పక్కనపెడితే స్వతహాగా కూడా ముక్కుసూటిగా ఉంటూ మొహం మీదే విషయాన్ని చెప్పేస్తారు. ఇంటర్వ్యూల్లో, పలు కార్యక్రమాల్లో సైతం ఈ రకమైన ధోరణిని గమనించవచ్చు. అదే తరహాలో ఆయన ట్విట్టర్ వేదికగా ఓ విషయం గురించి ఫైర్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్” చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు సందీప్. పాన్‌ వరల్డ్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ ” త్రిప్తి డిమ్రి ” నటించనుందని రీసెంట్ గానే ప్రకటించారు. అయితే అంతకు ముందు దీపికా పదుకునేని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీపికా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం.. సినిమా కోసం షరతులు పెట్టిందని గుసగుసలు వినిపించాయి. ఆ విషయంలోనే దీపికాకు – సందీప్ కి మనస్పర్ధలు వచ్చి ఆమెను సినిమా నుంచి తప్పించారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ ‘ఎక్స్’ వేదిక‌గా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ మేరకు ఆ పోస్టులో.. నేను ఒకరికి క‌థ‌ చెప్పినప్పుడు వారిపై వంద శాతం నమ్మకంతో చెబుతాను. తమ మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం ఇదేనా మీ ఫెమినిజం. ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. నాకు సినిమానే ప్రపంచం.. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం చేయ‌లేరు.. ఈ సారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com