సుప్రీంను ఆశ్రయించిన బిఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్‌ఎస్ పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్‌ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును బీఆర్‌ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది.
మేఘా చంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్‌ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భారాస సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇదిలావుంటే బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఈ పిటిషన్ దాఖలు చేయడమే గాకుండా కెటిఆర్ విసయంలో లీగల్‌గా చర్చించేందుకే అని తెలుస్తోంది.