Monday, March 10, 2025

కోడ్​ ముగియగానే రేషన్​ కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా

రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్​ కార్డులు పంపిణీ చేయడంతో పాటు ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు ఇస్తామని రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామనీ, శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఇండ్లు, పెన్షన్లన్నీ రేఫన్​ కార్డులు ఉంటేనే ఇస్తామని అందుకే రేషన్​ కార్డుల జారీని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com