దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో దివ్వెల మాధురి, దువ్వాడ వాణి.. దువ్వాడ శ్రీనివాస్ కోసం పోరాటం చేస్తున్నారు. మాధురితో తన భర్త దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణ హాని ఉందని వాణి ఆందోలన వ్యక్తం చేసింది. దీంతో వాణికి మాధురి కౌంటర్ ఇస్తూ.. “నా వల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించారు, రెండేళ్ల పాటు దువ్వాడ ఆలనా పాలనా నేనే చూసుకున్నా. రెండేళ్లుగా లేని థ్రెట్ ఇప్పుడే వచ్చిందా?. దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించింది. 10 మందిని తీసుకొచ్చి తలుపులు పగులగొట్టారు.
ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసు. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చా. నా డబ్బు చెల్లించి వాణి ఇంటిని తీసుకోవచ్చు” అని తెలిపింది.
మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్య వాణి, హైందవిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాడి చేయడమే కాకుండా తన నివాసంపై రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 41ఏ నోటీసులిచ్చినట్లుగా పోలీసులు వివరించగా.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనపై, తన కూతురిపై దాడి చేశారని దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడపై కేసు నమోదయింది.