- డీఎంఈ వాణి అపాయింట్మెంట్ చెల్లదు
- నిబంధనల మేరకు కొత్తవారిని నియమించండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
టీఎస్, న్యూస్: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) వాణి అపాయింట్మెంట్ ను హైకోర్టు రద్దు చేసింది. నిబంధనల మేరకు కొత్త డీఎంఈని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాణి నియామకాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ హైకోర్టులో పిటిషన్దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం.. వాణి అపాయింట్మెంట్ చెల్లదు అని ప్రకటించింది. కాగా.. సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వాణికి.. డీఎంఈగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.