Monday, January 27, 2025

వేసవిలో పవర్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు..

రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ప్రజా భవన్‌ ‌లో ఎన్‌పిడిసిఎల్‌, ‌ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో  రానున్న వేసవిలో విద్యుత్‌ ‌సరఫరా ప్రణాళికాలపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వేసవిలో విద్యుత్‌ అం‌తరాయం అనే మాట తలెత్తకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ ‌ను నిరంతరంగా సరఫరా చేయాలని ఆదేశించారు. వేసవి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు సీఎండీలు మొదలు ఎస్‌ఈల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశాలలో వినియోగదారులను, మీడియా ప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలని ఆదేశించారు.
గత వేసవిలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ రానున్న వేసవిలో సమర్థవంతంగా విద్యుత్‌ ‌సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను  ఈ సమావేశాల్లో వివరించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ‌ను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 108 తరహాలోనే విద్యుత్‌ ‌సరఫరాలో సమస్యల పై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. 1912 కు వొచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని, ఈ వ్యవస్థ నిర్వహణ ప్రచారానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్పీడీసిఎల్‌ ‌పరిధిలో వొచ్చే మార్చిలో పీక్‌ ‌డిమాండ్‌ 6,328 ‌మెగా వాట్ల విద్యుత్‌ ‌సరఫరా చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు ముందస్తుగా తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పీక్‌ ‌డిమాండ్‌ ‌ను తట్టుకునేలా ట్రాన్స్ ‌మిషన్‌ ‌వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. సబ్‌ ‌స్టేషన్ల వారీగా ఓవర్‌ ‌లోడ్‌ ‌సమస్యలను గుర్తించి ముందుగానే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవేళ ఈదురుగాలుల వల్ల విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడితే ఎమర్జెన్సీ రీస్టోర్‌ ‌టీం వాహనాలను వాడుతున్నారని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా అందించడానికి ప్రతీ ఒక్కరూ కష్టపడుతున్నారని  ట్రాన్స్‌కో,  ఎన్పీడీసిఎల్‌ అధికారులను అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ డి కృష్ణభాస్కర్‌, ఎన్పీడీసిఎల్‌ ‌సీఎండీ కర్నాటి వరుణ్‌ ‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎన్పీడీసిఎల్‌ ‌డైరెక్టర్లు, ఇతర ముఖ్య ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా మాట్లాడుతూ ముందస్తుగా అన్ని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ ‌సరఫరా అందజేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్‌ అధికారులు పర్యటించి వినియోగదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఒకవేళ విద్యుత్‌ ‌సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయ విద్యుత్‌ ‌సరఫరా అందించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ ‌మాట్లాడుతూ ఎప్పటికప్పుడు లోడ్‌ ‌మానిటరింగ్‌ ‌చేస్తూ 132/33 కేవి సబ్‌ ‌స్టేషన్ల లో కావలసిన సామర్థ్యం మేరకు పవర్‌ ‌ట్రాన్స్ ‌ఫార్మర్లు పెంచుతున్నామని, దీని వలన వేసవిలో ఎంత డిమాండ్‌ ఉన్నా ఎటువంటి అంతరాయాలు ఏర్పడవని వివరించారు. ఎన్పీడీసీఎల్‌ ‌సీఎండీ కర్నాటి వరుణ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ మార్చి నెలలో 6,328 ల మెగావాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌చేరుకుంటుందన్న అంచనా మేరకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా 44 పవర్‌ ‌ట్రాన్స్ ‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, మరో 32 వొచ్చే నెల వరకు పూర్తి చేస్తామని తెలిపారు. 33 కేవి 13 ఓవర్‌ ‌లోడ్‌ ‌ఫీడర్స్, 11 ‌కేవి 35 ఓవర్‌ ‌లోడ్‌ ‌ఫీడర్స్ ‌కూడా లోడ్‌ ‌రిలీఫ్‌ ‌చేశామని అన్నారు. ట్రాన్స్ ‌ఫార్మర్‌ ‌సామర్థ్యం పెంపు, ప్రత్యామ్నాయ లైన్ల ఏర్పాటు, 17 కొత్త సబ్‌ ‌స్టేషన్ల ఏర్పాటు, రాబోయే మార్చిలో 12 కొత్త సబ్‌ ‌స్టేషన్ల ప్రారంభిస్తామని అన్నారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎండీ వరుణ్‌ ‌రెడ్డి తెలిపారు. జనవరి 27 న నోడల్‌ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ ‌ను వెల్లడించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. కాగా జనవరి 29న నోడల్‌ అధికారులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా, సబ్‌ ‌డివిజన్‌ ‌స్థాయిలో వేసవి కార్యాచరణపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు చేపట్టిన పనుల ప్రగతిని వివరించడం తో పాటు 1912 విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ సమావేశాలలో వినియోగదారులు, మీడియా మిత్రులని భాగస్వాములను చేస్తామని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com