Saturday, February 8, 2025

కులగణనపై సభలో వాడీవేడి చర్చ

•బిసిలకు పథకాల్లో లబ్ది చేకూర్చాలన్నదే లక్ష్యం
•విపక్షాలు ఇందుకు సిద్దంగా ఉన్నాయా చెప్పాలి
•దేశంలోనే తొలిసారిగా కులగణన సర్వే చేపట్టాం
•భవిష్యత్‌ ‌కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్‌
•నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి
•కులగణన సర్వేపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి పొన్నం

బిసి కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. బిఆర్‌ఎస్‌  ‌నేతలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ఇలా పాల్గొనని నేతలకు సభలో మాట్లాడే అర్హత లేదన్నారు. వారికి మైక్‌ ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరారు. ‘కులగణన సర్వే 50 రోజులు జరిగితే .. మాజీ సీఎం కేసీఆర్‌, ‌మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌బిజెపి ఎంపీ డీకే అరుణ సర్వేలో పాల్గొనలేదు. సర్వేలో భూమి వివరాలు చెప్పాలని ఫామ్‌లో ఒక కాలమ్‌ ఉం‌టే.. కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావు ఎవరూ సమా చారం ఇవ్వలేదు. 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొ ంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భూముల వివ రాలు ఇచ్చారు. కానీ, భూముల వివరాలు అడగ్గానే కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావు భయపడి సర్వేలో పాల్గొనలేదు‘ అని అన్నారు. గత ప్రభుత్వం సమగ్రసర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.

దానిని పబ్లిక్‌ ‌డొమైన్‌లో ఎందుకు పెట్టలేదన్నారు. ఆనాడు అధికారికంగా అసెంబ్లో ఎందుకు పెట్టలేదని బిఆర్‌ఎస్‌ను నిలదీశారు. ఇదే సందర్భంలో రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరం కనుక అసెంబ్లీలో తీర్మానం చేసినా లాభం లేదన్నారు. అందుకే పార్టీ పరంగా  స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పక్షాన బీసీలకు 42శాతం సీట్లు ఇస్తాం అని ప్రకటించారు. అన్ని పార్టీలు దీనికి కట్టుబడి ఉంటాయా అని ప్రశ్నించారు.  రాజకీయాల్లో బీసీలకు మేం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడి నుంచి మాట తీసుకున్నా. అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలి. కులగణన సర్వే డేటాను సంక్షేమ పథకాల విధానాల తయారీకి వాడతాం. 1931 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జనగణన చేపట్టారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఇప్పటి వరకు జనగణన జరగలేదు.

2021 నుంచి ఇప్పటి వరకు సర్వే చేయకుండా వొదిలేశారు. దీనిపై బిజెపి నేతలు ప్రధాని మోదీపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్నారు. బలహీన వర్గాలకు వారి హక్కులు ఇవ్వడం బిజెపికి ఇష్టం లేదు. ప్రధాని మోదీ .. బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలనుకుంటే 2021లో లెక్కించాల్సిన జనాభాను ఇంతవరకు ఎందుకు చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. ‘రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటక, బిహార్‌ ‌సహా వివిధ రాష్టాల్లో్ర జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం.

రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారు. ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తాం. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ స్టిక్కర్‌ అం‌టించాం. ఒక ఎన్యుమరేటర్‌ ‌రోజుకు 10 ఇళ్లకంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారు. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించాం‘ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

సర్వే ఆధారంగా అన్ని కులాలకు సమన్యాయం
సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఈ సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్‌లా పనిచేస్తుంది. భావితరాలకు న్యాయం చేయడానికి సమగ్రంగా వివరాలు సేకరించాం. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. బీసీలకు న్యాయం చేసేందుకు చేపట్టాల్సిన పథకాలపై విపక్షాలు సూచనలు చేయాలి‘ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు.
అంతకుముందు సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి  అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్‌ ‌భేటీ కొనసాగింది.

ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. క్యాబినెట్‌ ‌భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. పకడ్బందీగా సర్వేచేసి సమాచారం సేకరించాం. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్‌ ‌మ్యాప్‌ ‌తెలంగాణ నుంచి ఇస్తున్నాం. కులగణన విషయంలో ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్‌ ‌సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తాం. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా! ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.

కులగణన వివరాలు
ఎస్సీలు 61,84,319 మంది (17.43 శాతం)
ఎస్టీలు 37,05,929 మంది (10.45 శాతం)
బిసి (ముస్లిం మైనారిటీ మినహా) లో 1,64,09,179 (46.25 శాతం )
ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం)
ముస్లిం మైనారిటీ లో బిసీలు 35,76,588,(10.08 శాతం )
ముస్లిం మైనారిటీలో ఒసిలు8,80,424 (2.48 శాతం )
ఓసీలు 56,01,539 మంది (15.79 శాతం)
ఓసీలలో ముస్లిం మైనారిటీలు 8,80,424 (2.48 శాతం)
ముస్లిం మైనారిటీ మినహా ఓసీలు 47,21,115 (13.31 శాతం)

గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు..
పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే

మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134.
సర్వేలో పాల్గొనని కుటుంబాల సంఖ్య 3,56,323.
సర్వేలో చేసిన వ్యక్తుల సంఖ్య 3,54,77,554
సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు 1,03,889

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com