Sunday, October 6, 2024

రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

  • సిఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి
  • చర్చకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా
  • కెసిఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకొచ్చే దమ్ము హరీష్ రావుకు ఉందా?
  • కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని బిఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సిఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి చర్చకు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, కెసిఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకొచ్చే దమ్ము హరీష్ రావుకు ఉందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అక్కడ, ఇక్కడ భయం అయితే నేరుగా సిద్దిపేటలోనే చర్చ పెడదామని జగ్గారెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని జగ్గారెడ్డి తెలిపారు.

సాంకేతిక కారణాల వల్ల కొందరికీ రుణమాఫీ కాలేదన్నారు. ఆ విషయం ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందన్నారు. వివరాలు తెప్పించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కెసిఆర్, హరీష్ రావు తప్పులే కారణమని జగ్గారెడ్డి మండిపడ్డారు. పదే పదే రుణమాఫీ చేయలేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామంటున్నారు. ఈ పరిస్థితికి కారణం మీరే అని తాను కెసిఆర్ ఫాంహౌజ్ ఎదుట దీక్ష చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఏ మొహం పెట్టుకొని హరీష్ రావు ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తారని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలను కెసిఆర్ నిండా ముంచారని జగ్గారెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలగొట్టినప్పుడు ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు ఏం చేశారని హరీష్‌రావును జగ్గారెడ్డి ప్రశ్నించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular