హైకోర్టు తీర్పుతో ఇది తేటతెల్లమైంది..
గ్యారెంటీల నుంచి తప్పించుకునే గారడీ
శుక్రవారం వొచ్చిందంటే చాలు కేసులతో దాడి.
తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్‌ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసును తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేశారు. ఈ-కారు రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగాం. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగినం. స్పీకర్ ని ఇటీవలే కలిసి అడిగాం. ఈరోజు సభలో అడిగాం. మిమ్మల్ని బయటకు పంపి సభలో చర్చ కొనసాగించారు. కేసు పెట్టవద్దని మేం అడగటం లేదని, చర్చ పెట్టండి అని అడిగమని చెప్పారు. ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియ వద్దా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫార్ములా ఇ రేసులో 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మిగతా 50శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని సదరు సంస్థ చెప్పింది. 45లక్షల పాండ్స్ అంటే సుమారు 47 కోట్లు. కాని రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పారు.వాస్తవానికి 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగింది.
రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, 700 కోట్ల నష్టం రాష్ట్రానికి వాటిల్లింది. ఫార్ములా ఇ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్ కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది. రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం. రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ తీశారు.అసలు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు.? అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది.? రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు. ఇందులో అవినీతి ఏముంది. ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది కావొచ్చు, అవినీతి లేదు.
పొన్నం ప్రభాకరే నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందని చెప్పారు. వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తుంది. 2022లో ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు చూశారు. తెలంగాణ ఖ్యాతి పెరిగింది. 42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్ ప్రదేశ్ 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు, మీ కాంగ్రెస్ దిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ 70వేల కోట్లతో నిర్వహించారు. అదొక పెద్ద స్కాం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే కేటీఆర్ ని అభినందించారని హరీష్ రావు గుర్తుచేశారు.
అలవి గాని హామీలతో మభ్యపెట్టారు.
అలవిగాని హామీలిచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మభ్య పెట్టాడని హరీష్ రావు విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో తెలియక భయపడుతున్నాడని, ఎలాగైనా గట్టెక్కాలనే . ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రమే దివాలా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలు పెట్టాడని మండిపడ్డారు. రాష్ట్రం దివాలా తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివాలా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని ఎద్దేవా చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలుగు లక్షల 17వేల కోట్ల అప్పే అని శాసన సభ సాక్షిగా నోరు మూయించామన్నారు. గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వొచ్చింది. ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు.
ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే చాలు అరెస్టులు.. రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు.నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు కేటిఆర్ బయటపెడుతున్నాడు. నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నాడు. మీ బ్రదర్స్, అల్లుడు, బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నాడని అన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్న లూటిఫికేషన్ ను కేటీఆర్ బయటపెట్టాడని అన్నారు. ఇవన్నీ చేసిండు కాబట్టే . ఏదో ఒక కేసు పెట్టాలని, ఎలాగైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపారని ఆరోపించారు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్ ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ చేసిన తప్పేంది.
ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఇ రేసును హైదరాబాదుకు తెచ్చారని, గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చాలనుకున్నారని హరీష్ రావు అన్నారు. అది కేటీఆర్ తప్పా? అని ప్రశ్నించారు. 2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో ఫార్ములా ఇ రేసు నిర్వహిస్తే, రాష్ట్ర జీఎస్డీపీకి రూ. 700 కోట్లు సమకూరిందని నీల్సన్ అనే ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థ చెప్పింది. సాధారణంగా ఇలాంటి రేసులకు సంబంధించి హోటళ్లకు 12శాతం జీఎస్టీ, రేసులకు 28శాతం జీఎస్టీ ఉంటుంది. సగటున తీసుకున్నా రూ. 700 కోట్లకు గాను జీఎస్టీ కింద సుమారు 20శాతం జమ అయి ఉంటుంది. అందులో 10శాతం నేరుగా రాష్ట్ర ఖజానాకు వస్తుంది. ఇంకో 10 శాతం కేంద్రం ఖజానాకు పోతుంది. అంటే రాష్ట్రం రూ. 30 కోట్లు పెట్టుబడి పెడితే రూ.70 కోట్ల జీఎస్టీ రాష్ట్ర ఖజానాకు, మరో రూ. 70 కోట్లు కేంద్ర ఖజానాకు వెళ్లింది. కేంద్రానికి వెళ్లిన 70 కోట్లలో రాష్ట్రవాటా కింద 2.102 శాతం డెవల్యూషన్ కింద సుమారు కోటిన్నర రూపాయలు మళ్లీ రాష్ట్ర ఖజానాకే వస్తాయని వివరించారు. అంటే కేటీఆర్ చేసింది ఏంటి. రూ. 30 కోట్లు ఖర్చు చేసి రూ. 71.50 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూర్చారు. అది తప్పా? అని హరీష్ రావు అడిగారు.
ఇదే ఈవెంట్ మూడేళ్లు నిర్వహించేందుకు గాను ప్రభుత్వంతో ఒప్పందం కుదిర్చారు. ఎలక్షన్ కోడ్ వయొలేషన్ ఉందన్నారు. నిర్ణయం ఏడాది క్రితం అయ్యింది. ఎన్నికల కోడ్ రాకముందే అంతా జరిగింది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ కు కోడ్ ఉండదు. ఒక వేళ ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఏసీబీ కి ఏం సంబంధం. ఏ1 కేటీఆర్, ఏ2 అధికారి, అయితే ఆ కంపెనీ మీద ఎందుకు పెట్టలేదు.? మొన్న సాయంత్రం 5 గంటలకు దానకిషోర్ ఫిర్యాదు చేసారు. 24 గంటలు జరగకముందే కేసు పెట్టారు. దీని వెనుక కుట్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టం.అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి దివగంత దాసరి నారాయణ రావు గతంలో చంద్రబాబు పాలన ఎట్లుండెనో చెప్పేందుకు ఓ సినిమా తీశారు. ఆ సినిమా పేరు ‘‘ పిచ్చోడి చేతిలో రాయి’’ అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు, ఎవరి మీద పడుతాడో, ఏం కేసులు పెడతాడో తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం వొచ్చిందంటే చాలు అందరూ భయపడే పరిస్థితి ఉందని అన్నారు. రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలు, చివరకు పోలీసుల మీద కూడా కేసులు పెట్టించారని మండిపడ్డారు. సినిమా వాళ్ల మీద కూడా కేసులు పెట్టించిన ఘనత రేవంత్ కే దక్కుతుందన్నారు.
ఆయన పాలనా వైఫల్యాలపై అడుగడుగునా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం పెద్ద విషయమా? అని నిలదీశారు. కేటీఆర్ మీద తన మీద తలసాని, పల్లా , కౌశిక్ రెడ్డి,, పట్నం నరేంద్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని తెలిపారు.
సీఎం రేవంత్ పై తనదైన శైలిలో పంచ్‌లు
సీఎం రేవంత్‌పై హరీష్‌రావు తనదైన శైలిలో పంచ్‌లువేశారు. ‘పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్దాలతో బుకాయించు.. ’ ఇదే రేవంత్ రెడ్డి తీరని అన్నారు. దిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి, గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి.. 125 అడుగుల అంబేద్కర్ కే తాళం వేసి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అని హరీష్ రావు విమర్శించారు. . ఎండాకాలం వడదెబ్బ తప్పించుకోవచ్చు గానీ, రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బ తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యిందన్నారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, కేటీఆర్ నీ వెంటపడడ మానరు, నీ బండారం బయటపెట్టడం ఆపరు. ఈ పిచ్చి కేసులకు భయపడి మా లీడర్లు గానీ, క్యాడర్లు గానీ ఎక్కడా తగ్గరు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసినవాళ్లం. వెనకడుగు వేసిది లేదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారు. చోటే బాయ్ బడా బాయ్ బంధం బయట పడింది. సివిల్ సప్లైలో కుంభకోణం జరిగింది, రేవంత్ రెడ్డిపై విచారణ జరపాలని అడిగితే చేయరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రైడ్ అయింది. ఏమైందో ఎవరూ చెప్పరు. అమృత్ స్కాం గురించి దిల్లీ వెళ్లి చెప్పినా, ఎవ్వరూ స్పందించరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానుకొని రాష్ట్రం కోసం పని చేయాలని హరీష్ రావు హితువు పలికారు.