Monday, November 18, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి కొనసాగుతున్న విరాళాల వెల్లువ

  • ముఖ్యమంత్రి సహాయనిధికి కొనసాగుతున్న విరాళాల వెల్లువ
  • సిఎంకు చెక్కులను అందచేసిన ప్రముఖ సంస్థలు

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. మంగళవారం సిఎం సహాయనిధికి మెగా కృష్ణారెడ్డి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, సైనెట్ లిమిటెడ్ కంపెనీ కోటి రూపాయలను, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ.కోటి విరాళాలకు సంబంధించిన చెక్కును సిఎంకు అందచేశారు. వీరితో పాటు మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవి కైలాస్‌లు సైతం సిఎంను కలిసి కోటి రూపాయల విరాళాన్ని అందచేశారు.

వరద బాధితులకు ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరుపున సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును సుప్రియ అందజేశారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాత దిల్‌రాజు రూ. 25 లక్షల చెక్కును సిఎంకు అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు సిఎం వారిని అభినందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular