Monday, January 6, 2025

దొంగతనానికి వచ్చి తాగి అక్కడే పడుకున్నాడు

ఈ మధ్య కాలంలో అన్నీ వింతలు విచిత్రాలే జరుగుతున్నాయి. అదేమిటంటే మెదక్‌ జిల్లాలో ఓ దొంగ విచిత్రంగా ప్రవర్తించాడు. అదేమిటంటే… దొంగ‌త‌నానికి వచ్చినవాడు… దొంగతనం చేసుకుని పోవాలి. కానీ ఇంత వెర్రీ దొంగ ఉంటాడని ఎవరూ అనుకోలేదు. వైన్ షాపులో దొంగ‌త‌నానికి వ‌చ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్నాడు ఓ దొంగ. ఈ సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్ షాపులో దొంగతనానికి వచ్చి కౌంటర్‌లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు దొంగ. ఇక దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులో అక్కడే నిద్రపోయాడు. ఇక ఉదయం వైన్ షాపు తెరిచి చూడగా నిద్రపోతూ పట్టుబడ్డాడు ఆ దొంగ. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. అతన్ని మందలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com