Tuesday, December 24, 2024

Donkey Milk Scam గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల మోసం

  • ఒక్కో గాడిదను రూ.1.5 లక్షలకు విక్రయించిన చెన్నైకి చెందిన ‘డాంకీ ప్యాలెస్’
  • లీటర్ గాడిద పాలను తామే రూ.1 వెయ్యికి కొంటామన్న ‘డాంకీ ప్యాలెస్’
  • ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయన్న బాధిత రైతులు
  • గాడిద పాల ఉత్పత్తి పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది

చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల రైతులను మోసం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు.

గాడిద పాల ఉత్పత్తి పేరుతో మోసపోయిన రైతులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘డాంకీ ప్యాలెస్’ అనే చెన్నై సంస్థ ఒక్కో గాడిదను రూ.1.5 లక్షలకు తమకు విక్రయించిందని, లీటర్ గాడిద పాలను రూ.1,000కి కొనుగోలు చేస్తామని చెప్పిందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. మూడు నెలల పాటు గాడిద పాలను కొనుగోలు చేసి నమ్మకం కలిగించినట్లు చెప్పారు.

అయితే గత 18 నెలలుగా గాడిద పాలకు డబ్బులు ఇవ్వడం లేదని వారు వాపోయారు. ‘డాంకీ ప్యాలెస్’ సంస్థ తమకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు అనే బాధితుడు మాట్లాడుతూ… ‘డాంకీ ప్యాలెస్’ గురించి చెబితే తాను రూ.56 లక్షలు ఇన్వెస్ట్ చేశానని..

తమకు మూడు నెలల పాటు డబ్బులు ఇచ్చారని, కానీ ఆ తర్వాత నుంచి ఇవ్వలేదన్నారు. తమ ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. తెలంగాణ నుంచి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com