- రాజ్యసభ చైర్మెన్ ఆగ్రహం వ్యక్తం చేసిన జయ
సాధారణంగాభర్త పేరు చేర్చి పిలిస్తే భార్య సంతోషంంగానే రిసీవ్ చేసుకుంటుంది. అది ఆమె గౌరవంగాభావిస్తుంది కూడా. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ మాత్రంతన భర్త పేరుతో పిలవద్దని అల్టిమేటం జారీ చేసింది. అది కూడా ఎక్కడో కాదు.. సాక్షాత్తు పార్లమెంట్ లో. పార్లమెంటు వర్షాకాలసమావేశాలు చాలా హాట్ హాట్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలో ఓ చర్చ సందర్బంగా రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ కు, ఎంపీ జయా బచ్చన్ మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.జయా బచ్చన్ ను రాజ్యసభ డిప్యూటీఛైర్మన్ పిలిచిన సందర్బంగానే వారిద్దరి మధ్య వివాదం చలరేగింది.
సూపర్ స్టార్అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్.. రాజ్యసభలో లేవనెత్తిన అంశం చర్చనీయాంశమవుతోంది. రాజ్యసభలో ఓ అంశంపై మాట్లాడేందుకుడిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ జయా బచ్చన్ కు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనజయా అమితాబ్ బచ్చన్ అని సంభోదించారు. దీంతో ఒక్కసారిగా జయా బచ్చన్ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని, జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సిన అవసరం లేదని కోపంగా సమాధానం చెప్పారు.
ఎందుకో ఏమోతెలియదు కానీ తనను జయాఅమితాబ్ బచ్చన్ అని పిలవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలవాలని రాజ్యసభ చైర్మెన్ కు చెప్పారు.జయా బచ్చన్ అసహనంపై స్పందించిన డిప్యూటీ ఛైర్మన్హరివంశ్ నారాయణ్.. తన వద్ద ఉన్నరికార్డుల్లో జయా అమితాబ్బచ్చన్ అని ఉన్నందునే అలా పిలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో జయా బచ్చన్ మరోసారి చైర్మెన్ పై ఆగ్రహంవ్యక్తం చేశారు. మహిళలను భర్తపేరుతో మాత్రమే గుర్తిస్తారా? వారికిసొంతంగా ఉనికి లేదా అని ఆగ్రహంతో నిలదీశారు. దీంతో రాజ్యసభలో ఒక్కసారిగా సభ్యులంతా అవాక్కయ్యారు.