Friday, November 15, 2024

నన్ను చంపండి కానీ ఫాతిమా కాలేజీని కూల్చకండి అక్బరుద్దీన్ ఒవైసీ

బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్ లను నిర్మించానన్న ఒవైసీ… వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు. గతంలో తనపై కాల్పులు జరిగాయన్న ఒవైసీ… కావాలంటే మళ్లీ తనపై బుల్లెట్ల వర్షం కురిపించండి.. కత్తులతో దాడి చేయండి.. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండంటూ ప్రభుత్వాన్ని కోరారు ఒవైసీ .

బండ్లగూడ మండలంలోని సల్కం చెరువులో ఓవైసీ బ్రదర్స్‌ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించిన శాటిలైట్ ఫోటోస్ నెట్టింట వైరల్​గా మారాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడంలేదని సీఎం రేవంత్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒవైసీకి చెందిన ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్​ కూడా డీఎంఆర్ చెరువు సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీటిని ఎప్పుడు కూలుస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్​, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. మరి వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్న ఒవైసీ .. మరి దాన్ని ఏం చేస్తారని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని.. మరి దాని పరిస్థితేంటి- అని ఒవైసీ ప్రశ్నించారు. వక్ఫ్ కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశ పెడుతుందని ఆరోపించారు ఓవైసీ.. ముస్లీంలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. మజీద్లు, దర్గాల లాగే.. వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదన్నారు.. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీద్ కు డీడ్ కావాలంటే ఎక్కడా తేవాలన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular