Friday, December 27, 2024

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

  • ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి
  • పురుగుమందు డబ్బాలు పట్టుకొని
  • చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును వెల్లబోసుకున్నారు. కాగా తమ భూములను అభివృద్ధి పేరుతో అధికారులు గుంజుకోవాలని చూస్తున్నారని.. పొజిషన్‌లో ఉన్న మా భూములు మాకు దక్కకపోతే పురుగుల మందు తాగి  చనిపోతామంటూ  చిన్న బండిరేవు గ్రామానికి చెందిన  సుమారు 50 మంది రైతులు గురువారం పంట పొలాల వద్ద  పురుగుల మందు డబ్బాలు పట్టుకుని  నిరసన తెలిపారు.

నల్లబెల్లి రెవెన్యూ విలేజ్‌ పరిధిలోని  చిన్న బండి రేవు గ్రామంలో సర్వేనెంబర్‌  51/3 అనే పలు సర్వే నెంబర్లతో సుమారు  30 ఎకరాల భూమిని రైతులు కలిగి ఉన్నారు.  సుమారు 50 మంది రైతులకు ఎకరం,  ఆరెకరం,  20 సెంట్లు, 10 సెంట్లు, ఐదు సెంట్లు  భూమి కలిగి ఉన్నారు.  ఈ భూములను  1970 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నట్లు  రైతులు చెబుతున్నారు. వర్షధారంగా ఉన్న ఆ భూములు  రైతులు  పంటలు వేస్తూ  ప్రతి ఏడు  తీవ్రంగానే నష్టపోతున్నారని వాపోయారు.

ఇంటిగ్రేడ్‌ స్కూల్‌ పేరిట భూమి సర్వే
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టిందని రైతులు తెలిపారు. అందులో భాగంగా రైతులకు చెందిన భూమిలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల  నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడంతోపాటు ప్రభుత్వ భూమిగా తెలిపి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో రైతులు లబోదిబోమంటూ తహసీల్దార్‌ కార్యాలయానికి పరుగులు తీశారు. దీంతో తహసీల్దార్‌  దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని తులకు తెలిపారు. దీంతో రైతులు  పొజిషన్‌ సర్టిఫికెట్లతోపాటు  శిస్తు చెల్లించిన రసీదులను అందజేశారు. వెనువెంటనే ఆ భూములపై మీకు ఎటువంటి హక్కులు లేవని నోటీసులు జారీ చేయడంతో రైతులు వాటిని తిరస్కరించారు.

ఆత్మహత్యలే మాకు శరణ్యం
భూములను నమ్ముకుని  బతుకుతున్నామని, ఇప్పుడు భూములు దక్కకపోతే పంట పొలాల్లోనే  పురుగుల మందు తాగి చనిపోతామని, తమ  శవాలపై భవంతులు కట్టుకోవాల్సి వొస్తుందని  రైతులు గురువారం పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం కోసం అనేక చోట్ల  భూములు ఉన్నాయని, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేదల భూములే  అధికారులకు కావలసి వొచ్చిందా అంటూ  కన్నీటిపర్వంతమయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com