Thursday, March 13, 2025

ఆ పొరపాట్లు మళ్లీ జరగనివ్వొద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

టీఎస్​, న్యూస్​:“ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి…అందుకే చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది..” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కొవొద్దని పార్టీ నేతలకు ఆయన హితభోద చేశారు. ప్రతి ఓటును ముఖ్యమైనదిగా భావించి ఆ ఓటు మనకే పడే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పై అప్పుడే ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగియాయని అన్నారు. ప్రస్తుతం ప్రజలు కేసీఆర్ పాలనలో జరిగిన మేలు గురించి చర్చించుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రతి ఇంటి తలుపు తట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లో మ‌న‌కు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే అని అన్నారు.మేడ్చ‌ల్ అంట‌నే మాస్.. మ‌ల్ల‌న్న మరీ మాస్ అన్నారు. మ‌ల్లా రెడ్డి మేడ్చ‌ల్‌కే ప‌రిమితం కాకుండా.. రాష్ట్ర‌మంతా తిరగాలి. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఆయ‌న గొంతు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించి ఎన్నో ర‌కాల సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్ని గెలిచామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందన్న విషయాన్ని ఇది రుజువు చేస్తోందన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంటల్లో గులాబీ జెండ రెపరెపలాడిందన్నారు. ఇదే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి సామాజిక సేవ‌లు చేస్తూ మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లోని ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి ఉన్నారు. బ్ర‌హ్మాండంగా ఆయ‌నకు సేవాగుణం ఉంది. అందుకే కేసీఆర్ ఆయనను పిలిచి టికెట్ కేటాయించారన్నారు.

సిగ్గు….శరం ఉండాలి
మందికి పుట్టిన బిడ్డలను నా బిడ్డలని చెప్పుకునే తత్వం సీఎం రేవంత్ రెడ్డిదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులను నేను చేశానని చెప్పుకోవటానికి ఆయనకు సిగ్గు, శరం ఉండాలన్నారు. గెలుస్తానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని, కానీ అదృష్టం కొద్ది గెలిచిండన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తుండటం చూస్తే జాలేస్తోందన్నారు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన ఉద్యోగాలు ఇయ్యాలేదని ధ్వజమెత్తారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగులు నీ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు చైతన్యవంతులు మీ అంతు చూస్తారని హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com