Friday, November 15, 2024

రిధాన్యం కొనుగోళ్లలో పొరపాట్లు జరగొద్దు

అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి ఒక ప్రకటనలో సూచించారు. వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఇన్‌ఛార్జి ఎండి ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ శ్రీరాములు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తరుచూ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి వివరాలు అందచేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతము 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

వరి కొనుగోళ్ళు ఊపందుకున్న దృష్ట్యా వరి సేకరణ, తరలింపు, నిల్వలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవల్సిన తక్షణ చర్యల గురించి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో అవసరమైన సామాగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, కోతలు, సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పని చేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆగ్రోస్ ఎండీ రాములును ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గోదాముల నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న గోదాముల నిల్వ సామర్ధ్యం, వెంటవెంటనే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్, వేర్ హౌసింగ్ అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular