Friday, March 28, 2025

దోస్త్‌ ప్రాబ్లమ్స్‌

ఆయోమయంలో డిగ్రీ స్టూడెంట్స్‌

రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ వేయాలనుకునే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటి వరకు కన్వినర్‌ని నియమించలేదు. ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని డిగ్రీ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దోస్ట్ సిస్టమ్‌ లోపాలతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. తదుపరి ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. దోస్త్ సిస్టమ్‌ అర్థంకాక డిగ్రీ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ కన్ఫూజన్‌లో పడ్డారు. తెలంగాణలో 2016-17 విద్యాసంవత్సరం నుంచి దోస్త్‌ అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఓ దరఖాస్తుతో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా మెరిట్‌ ప్రకారం డిగ్రీలో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. అయితే గతంలో ప్రతి కాలేజీకి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దరఖాస్తు ఫీజు కూడా విడివిడిగానే చెల్లించాలి. కానీ దోస్త్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 200 ఫీజుతో అన్ని కాలేజీలకు ఒకేసారి అప్లై చేసుకునే వెసులుబాటు లభించింది. ఆన్‌లైన్‌ పోర్టల్‌తో పాటు మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు.
అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఉన్న సీట్లకంటే డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 3.90 లక్షల మంది ఇంటర్‌ పాసవుతున్నారు. వీరిలో 45 శాతం మంది మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో 1,055 కాలేజీల్లో 4.62 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేలకుపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. దోస్త్ లోపభూయిష్టంగా ఉందని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు. మెరిట్‌ ప్రకారం సీట్ల కేటాయింపు ఉండటంతో విద్యార్ధులు కొందరికి దూరంగా ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. దీంతో సీటు వచ్చినా విద్యార్ధులు చేరడం లేదు. ఇంకోవైపు ప్రైవేటు కాలేజీలు ముందే విద్యార్థుల చేత తమ కాలేజీలో చేరేలా ప్రాధాన్యత ఆప్షన్లు పెట్టిస్తున్నాయి.
ఈ కారణాల వల్ల దోస్త్‌ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పలు దఫాలుగా నిర్వహిస్తున్నారు. దీంతో అకడమిక్‌ సంవత్సరం చాలా ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఇందులో మార్పులు తేవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దోస్త్ సిస్టమ్‌నే తీసేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కన్వినర్‌ను నియమించకపోవడంపై విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. దోస్త్‌లో కొన్ని మార్పులు అవసరమని, ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com