Friday, April 18, 2025

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది

  • సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి
  • మహానుభావుల ప్రగతిఫలాలను అందుకొని ప్రజలంతా ముందుకుసాగాలి
  • డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ, జడ్జి

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయని డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ, జడ్జి పేర్కొన్నారు. నాంపల్లి సిబిఐ కోర్టులో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఎగురవేశారు.

అనంతరం డాక్టర్ టి.రఘురామ్ ప్రిన్సిపల్ సిబిఐ జడ్జి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరంగంలో మార్పు కనిపిస్తుందని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆ మహానుభావుల త్యాగాల పునాదులపై మనదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకుపోవాలని ఆయన ఆకాక్షించారు.

ఆ మహానుభావుల ప్రగతిఫలాలను అందుకొని ప్రజలంతా ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైతేయినీ, జడ్జి, ఈఓ కోర్టు, మహ్మద్ అప్రోజ్ అక్తర్, జడ్జి, ఏసిబి కోర్టు, జ్యుడీషియల్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు బి.లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com