దివంగత ముఖ్యమంత్రి, డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్, విజయవాడ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
పేదలందరికీ ఆరోగ్యం అందాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వున్నపుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రజలకు ఆరోగ్య భీమా, గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, ఫీజు రీయింబర్సుమెంట్, జల యజ్ఞం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నివాళి అర్పించినవారిలో శ్రీ మేడా సురేష్, శ్రీ నరహరశెట్టి నరసింహ రావు, శ్రీ అన్సారీ, శ్రీ జంధ్యాల శాస్త్రి తదితరులు వున్నారు.