Saturday, April 19, 2025

ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగుతూ.. బార్‌ డ్యాన్సర్లతో అసభ్యకరమైన?

ఈ మధ్యకాలంలో సమాజంలో మితిమీరిన పోకడలు ఎక్కువవుతున్నాయి. కొంత మంది అసాంఘీక కార్యకలాపాలకు పవిత్రమైన స్థలాలను ఎన్నుకుంటున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగుతూ వీరంగం సృష్టించారు. స్కూల్ లో మధ్యం తాగడమే కాదు.. బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలోని సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బీహార్ పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసుకుని వీడియోలోని వ్యక్తులను గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com