నిందితుల అరెస్టు
సైబరాబాద్‌లో అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాదారుల నుంచి రూ.4.34కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ సరఫరాదారుల ముఠా ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
రోజుకో కొత్త మార్గం ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 620 గ్రాముల హెరాయిన్ మత్తుపదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4.34 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
నెలల వ్యవధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన అదేశాలు జారీ చేశారు.