Saturday, April 19, 2025

మోదీ అమెరికా సభలో డీఎస్పీ పుష్ప శ్రీవల్లి పాట

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం ప్రవాస భారతీయుల నుంచి మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ పుష్ప-1 లోని శ్రీవల్లి పాటతో ప్రవాస భారతీయులను ఊర్రూతలూగించారు. డీఎస్పీ నోట హర్‌ ఘర్‌ తిరంగా పాట సాగుతుండగానే ప్రధాని మోదీ వేదికపైకి వచ్చారు. నమస్తే ఇండియా.. అంటూ ప్రవాస భారతీయులను పలకరించిన దేవిశ్రీ.. ప్రధాని మోదీ సమక్షంలోనే తన పాటను కొనసాగించారు. ఆ తరువాత దేవీ శ్రీ ప్రసాద్ తో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాఢ్వీ, ఇతర కళాకారులను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలోనే కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com