Friday, February 21, 2025

దుబాయ్‌లో సిల్క్‌స్మిత నాకు స్పెట్స్‌ కొనింది- బాబుమోహన్‌

తెలుగు తెరకు నాన్ స్టాప్‌ కామెడీని అందించిన నటుడు బాబూ మోహన్‌. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “అప్పట్లో నేను చేసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాల వరుసలో ‘బావలు సయ్యా’ కూడా కనిపిస్తుంది. ఆ ఒక్క పాట కోసమే ఆడియన్స్ మళ్లీ మళ్లీ ఆ సినిమాను చూశారు. ఆ సినిమాలో సిల్క్ స్మిత అద్భుతంగా చేసింది” అని అన్నారు.

“సిల్క్ స్మిత బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని .. కాలుపై కాలు వేసుకుని కూర్చునేది. ఎవరినీ కేర్ చేసేది కాదు. హీరోలు వచ్చినా అలాగే కూర్చుంటావా? అని అడిగాను ఒకసారి. ‘హీరోలు వస్తే కాలు ఎందుకు తీయాలి’ అని ఆమె అంది. బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కారణం ఏమిటి అని అడిగాను .. తనని ఎవరు చూస్తున్నది గమనించడం కోసమని అంది. ‘బాస్’ అని పిలుస్తూ, నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేది” అని చెప్పారు.

” ఒకసారి దుబాయ్ లో షూటింగు .. షాపింగ్ కోసం నన్ను రమ్మంటే వెళ్లాను. అక్కడ ఆమె స్పెట్స్ తీసి చూపించి ఎలా ఉంది అని అడిగింది. సూపర్ గా ఉంది అన్నాను. అయితే ఇది నీ కోసమే అంటూ కొనిపెట్టింది. దానిని నేను దాచుకున్నాను. ఆమె ఏ ఎండకి ఆ గొడుకు పట్టేరకం కాదు. అలాంటివారిపై వివాదాలు రావడం సహజమే” అని అన్నారు. బేసిక్‌గా తన పాత్రలని బట్టి సిల్క్‌ స్మితని తప్పుగా చూసేవారుగాని ఆమె చాలా మంచిది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com