Monday, May 12, 2025

ఫ్యాషన్‌ స్టేట్మెంట్‌తో మమిత బైజూ ‘డ్యూడ్’ ఫస్ట్ లుక్

వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్‌టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా “ప్రేమలు” ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు “డ్యూడ్” పై ఎక్సైట్ మెంట్ ఇంకాస్త పెరిగింది. ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్‌లుక్ రిలీజైన తర్వాత ఇప్పుడు మేకర్స్ మమిత బైజూకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. “ప్రేమలు”లో తన ఎనర్జిటిక్ పాత్రతో మెప్పించిన మమిత, ఈ పోస్టర్‌లో ప్రదీప్‌కు పర్ఫెక్ట్ జోడీగా నిలిచారు. ఒకవైపు ప్రదీప్ స్మైల్‌తో రిలాక్స్ అవుతుండగా, మమిత స్టైలిష్ దుస్తులు, గాగుల్స్‌తో ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళికి సరైన ఎంటర్‌టైనర్ ను అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. ‘డ్యూడ్’ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com